కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో బాగంగా బందరులో పంపుల చెరువువద్ద ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద JAC కార్మికులు ధర్నా
Machilipatnam South, Krishna | Sep 20, 2025
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల, కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం పంపుల చెరువు వద్ద ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద జేఏసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ మూడవ దశ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగానిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ..ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.