విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి
- ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ఉపాధ్యాయులు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు ప్రభుత్వ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించి, పాఠశాలకు,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు విద్యాసామగ్రి వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంల