ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : ఇంచార్జ్ ఎంపీడీఓ
నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇంచార్జ్ ఎంపీడీఓ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జ్ ఎంపీడీఓ హైస్కూల్ విద్యార్థులతో కలసి జడ్పీ హైస్కూల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.. అనంతరం ఇంఛార్జ్ ఎంపీడీఓ సిహెచ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు