భీమిలి: మిస్సింగ్ కేసు నమోదు అయ్యిన వ్యక్తి గుండె పోటు తో మృతి చెందిన మృత దేహం లభ్యం
పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మిస్సింగ్ కేసు నమోదు అయ్యిన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయ్యింది. బోణి ముత్యాల నాయుడు వయసు 68 పొలంలో బోర్లా పడి ఉండటం కాళ్ళ శ్రీనివాస్ రావు గుర్తించి ముత్యాలనాయుడు కుమారుడు నరేష్ కు సమాచారం అందించారు. నరేష్ పొలంలో చూడగా తండ్రి మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. పొలంలో ఉండగా గుండె పోటు వచ్చి మృతి చెంది ఉండవచ్చు అని పోలీసులకు తెలిపారని అన్నారు. పద్మనాభం పోలీసులు ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.