రాయదుర్గం: పులకుర్తి గ్రామ స్మశాన వాటికలో నీటి సౌకర్యం కల్పించడంపై స్థానికుల హర్షం
డి.హిరేహాల్ మండలంలోని పులకుర్తి గ్రామంలో స్మశాన వాటికలో నీటి సౌకర్యం కల్పించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ దొణప్ఫ స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి బోరు వేయించారని తెలిపారు. దీంతో పుష్కలంగా నీరు పడటంతో మోటారు బిగించి నీటికి ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. కాలవశ్రీనివాసులు కు కృతజ్ఞతలు తెలిపారు.