రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని ఖండించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Nov 15, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో నగరంలోని ఐటిఐ మిట్టపైన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగానే శనివారం హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి జరిగిందన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి బాధ్యులు ఎవరో సీసీ కెమెరాల్లో రికార్డయి ఉందని,తక్షణం వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని పోలీసుశాఖను కోరారు.