అక్రమ మద్యం ధ్వంసం:జలదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున
Dhone, Nandyal | Dec 3, 2025 ప్యాపిలి మండలం జలదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై నాగర్జున ఆధ్వర్యంలో బుధవారం అక్రమ మద్యం ధ్వంసం చేశారు. 55 కేసులకు సంబంధించి 715 లీటర్ల నాటుసారా, 4.47 లీటర్ల కర్ణాటక మద్యం, 74.88 లీటర్ల ఏపీ మద్యాన్ని ధ్వంసం చేశామని ఎస్సై నాగార్జున తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.