ఇల్లందు: హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేసిన ఇల్లందు డీఎస్పీ చంద్రభాను
హోలీ తో పాటు రంజాన్ పండుగ కూడా ఉన్నందువలన ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ హోలీ పండుగను ఆనందోత్సాహాల నడుమ, సంతోషకరమైన వాతావరణలో హోలీ పండుగను జరుపుకోవాలని ఇల్లందు సబ్ డివిజన్ పోలీసు శాఖ తరుపున కోరుకుంటున్నామని DSP చంద్రబాను గురువారం సాయంత్రం 6:30 ప్రాంతంలో తన కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ హోలీ పండుగ అనంతరము గ్రామాలలో ఉండే చెరువులలో గాని కాలువలలో దిగి స్నానం చేసే విద్యార్థులు,యువకులు నీటిలోకి దిగాలని తెలుపుతూ DSP ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.