సత్తుపల్లి: తల్లాడ మండల కేంద్రంలో నకిలీ మందులతో రైతులకు నష్టం
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో వరి పైరు కొన్ని వేల ఎకరాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట వేయడం జరిగిందని గడ్డి మందులు నమ్మి రైతులు మోసపోతున్నారని వారు మండలంలోని తల్లాడ,అన్నారుగూడెం, బాలపేట, ముద్దునూరు,బిల్లుపాడు, రామచంద్రాపురం,కొత్త వెంకటగిరి గ్రామాల రైతులు కలుపు దుబ్బలు, గడ్డి మందు డబ్బాలతో స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నకిలీ మందులు అరికట్టాలని. అదేవిధంగా నకిలీ మందులు విక్రయాలు జరిపే ఫర్టిలైజర్ షాపులను లైసెన్సులో రద్దుచేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు పలు డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు.