అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణరెడ్డి, ఆర్డీఓలు కేశవనాయుడు, ఏబీవీఎస్బి శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జున, జిల్లా సైనిక్ సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.