విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని డిమాండ్ చేసి లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కోసం అద్భుత రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు 163వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించి, ఆయనకు ఘన నివాళులర్పించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బుధవారం కోరారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కోరుతూ బుధవారం జిల్లా పౌర వేదిక, ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి గురజాడ అప్పారావు విగ్రహం వద్ద శాంతి దీక్ష చేపట్టారు.