ధర్మారం: విద్యార్థుల జీవితాలకు గురువులే మార్గదర్శకులు: ధర్మారం ఎంఈఓ పోతు ప్రభాకర్
విద్యార్థుల జీవితాలకు గురువులే మార్గదర్శకులని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. ధర్మారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మధ్యాహ్నం జరిగిన కాంప్లెక్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ గురువుల ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో అత్యున్నతమైనది ఉపాధ్యాయ వృత్తి అనీ, ఉపాధ్యాయులే భావిభారత నిర్మాతలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులను ఆయన సన్మానించారు.