నంద్యాల పొన్నాపురం కెసికెనాల్ లో బుధవారంటీడీపీ శ్రేణులు జలహారతి కార్యక్రమం నిర్వహించారు.రబీ పంటకు నీళ్ళు వదలడంతో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ జలహారతి ఇచ్చారు.కార్యక్రమంలో పున్నాపురం ఇన్చార్జ్ మున్నా,టీడీపీ కౌన్సిలర్లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు మాట్లాడుతూ వైసిపి నాయకులు సీమలో నీటి కొరత అంటు దుష్ప్రచారం చేస్తూన్నారన్నారు.వైసిపి వాళ్ళు మూడేళ్లలో కాదు ముఫై ఏళ్ళు అయిన అధికారంలోకి రాలేరనీ స్పష్టం చేశారు.రాయలసీమలో సాగు,త్రాగు నీరు అందించిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందనీ హర్షం వ్యక్తం చేశారు.