జిల్లా పోలీసు కార్యాలయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( PGRS) కు 83 పిటీషన్లు: టౌన్ డిఎస్పి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | Nov 17, 2025
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించిన " PGRS (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక)" కార్యక్రమానికి ప్రజల నుండీ 83 పిటీషన్లు అర్బన్ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాలతో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు ప్రజల నుండీ పిటీషన్లు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన నాణ్యతగా పరిష్కారం చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలమూలల నుండీ వచ్చిన ప్రజలు స్వేచ్ఛగా పిటీషన్లు అందజేశారు. డీఎస్పీ పిటీషనర్లతో ముఖాముఖి మాట్లాడారు.