ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరపాడు పరిధిలోని గుంటి గంగమ్మ ఆలయంలో మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకాలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొని పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.