మంత్రాలయం: అర్హులైన ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలి:కౌతాళం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు
కౌతాళం :మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని కౌతాళం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అల్లూరి వెంకటపతి రాజు సూచించారు. బుధవారం ప్రజలతో ఆయన మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన-గ్రామీణ పథకం 2.0 కింద అర్హులను గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన గడువు ఈ నెల 14 వరకు పెంచిందని తెలిపారు. దరఖాస్తు కోసం స్థానిక సచివాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.