మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శనివారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.