ఖానాపూర్: పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ప్రజలు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను తప్పక పాటించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ ర్యాలీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు రోడ్లపై,మురుగు కాలువలలో చెత్తను వేయకుండా చెత్తను వారి వారి ఇంటికి వచ్చే చెత్త బండ్లోనే వేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.