అమరావతిలో ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాల్సిన ఆవశ్యకత లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలు నగరంలో జరిగిన ఎన్టీఆర్ 30 వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో పలు అంశాలను మాట్లాడారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా వేల కోట్లు వస్తాయని చెప్పారు. కొన్ని శక్తులు, రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడిపై బురద చల్లడం సభ్యత, సంస్కారం లేని కొన్ని రాజకీయ పార్టీలు చేసే పని అని మంత్రి ఆనం ధ్వజమెత్తారు.