మేడ్చల్: ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలలో పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఘట్కేసర్ లోని ఎన్ ఎఫ్ సి నగర్ లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ పార్థివదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాడే మోశారు. అందెశ్రీ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సీఎం భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.