చీపురుపల్లి: విజయనగరం పార్లమెంట్ స్థానానికి 30, అసెంబ్లీ స్థానాలకు 184సెట్ల నామినేషన్లు వచ్చాయన్న జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి
విజయనగరం పార్లమెంట్ స్థానానికి 18 మంది అభ్యర్థులు 30 సెట్లు, జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు 184 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి గురువారం తెలిపారు. శుక్రవారం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నియోజకవర్గ ఆర్ఓల సమక్షంలో నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని వివరించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు.