శ్రీ సత్య సాయి జిల్లా అమడగూడూరు మండలం కొత్తవారిపల్లిలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మద్యం మత్తులో వెంకట రాముడు అనే వ్యక్తి ఇంటిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.