అనంతపురం నగరంలోని జేఎన్టీయూ రోడ్ లోని జేఎన్టీయూ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎస్ఐఆర్సీ వారి ఐసిఏఐ (SIRC OF ICAI) కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జిఎస్టీ 2.0 సంస్కరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ సెంట్రల్ జిఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీ విధానాన్ని, అందులో ఫలితాలను సామాన్యులకు కూడా వివరించే ప్రయత్నంలో భాగంగా ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.