ఖమ్మం అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన పద్దతులను పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. విద్యా బోధనను పరిశీలించి, ఏ.ఐ. విద్యా బోధనకు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏ.ఐ.) ను వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు. విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.