మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్ నందు టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం రామారావు ఆశయాలను కొనసాగిస్తామని, కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్నగారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.