సత్తుపల్లి: ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై అంతర్రాష్ట్ర దొంగ కత్తితో దాడి
సత్తుపల్లిలో సోమవారం అంతర్ రాష్ట దొంగ బీభత్సం సృష్టించాడు.సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై నాలుగు చోట్ల కత్తితో దాడి చేసి పరారయ్యాడు.కానిస్టేబుల్ నరేష్ కు తల, భుజం భాగంలో నాలుగు చోట్ల అంతర్ రాష్ట్ర దొంగ గాయపరిచాడు.సత్తుపల్లి బస్టాండ్ లో అంతర్ రాష్ట దొంగ అనుమాన స్పందంగా ఉండటాన్ని ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ గుర్తించాడు.అంతర్ రాష్ట దొంగను వెంబడించి సత్తుపల్లి శివారు లో అడ్డగించారు.అడ్డగించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై కత్తితో దాడి చేసి అంతర్ రాష్ట్ర దొంగ పరార్ అయ్యాడు.కానిస్టేబుల్ నరేష్ ను చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.