శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని సచివాలయం వద్ద రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాల్లో భాగంగా ఉలువల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం వ్యవసాయ అధికారులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 80% సబ్సిడీతో కేవలం 112 రూపాయలతో 10 కేజీల ఉలవలను రైతులకు ప్రత్యామ్నాయంగా అందిస్తుందని తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.