ములుగు: 2 నెలల జీతాలు చెల్లించండి: ఏటూరునాగారం గ్రామపంచాయతీ కార్మికులు
Mulug, Mulugu | Sep 15, 2025 గత 2 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఏటూరునాగారం గ్రామపంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక MPDO శ్రీనివాస్ కు సోమవారం మధ్యాహ్నం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు తమ బాధ్యతలు, విధులు పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. అయితే జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ఖర్చులు, పిల్లల చదువులు ఇబ్బందిగా మారాయన్నారు. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.