మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసాయపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ కాలువలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు.