గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనుల్లో అక్రమాలు లేకుండా చూడాలని టీడీపీ నాయకుడు కళ్యాణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. గ్రామంలో గతేడాది వివిధ రకాల పనులు మొత్తం 27 పనులు నిర్వహించి, రూ.30 లక్షల నిధులు ఖర్చు చేశారని ఉపాధి అధికారులు వెల్లడించారు. కూలీల అభ్యంతరాలను స్వీకరించారు.