హుస్నాబాద్: రిలయన్స్ మాటలు బూజు పట్టిన పన్నీరు అమ్ముతున్నారని వినియోదారూడీ ఫిర్యాదు.30 వేలు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రిలయన్స్ మార్ట్ లో వస్తువులను, తినుబండారాలను మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. మార్ట్ లో గత రెండు రోజుల క్రితం బూజు పట్టిన పన్నీరు అమ్మారనీ ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు. రిలయన్స్ మార్ట్ లో ఉన్న వస్తువులు, తిను బండారులపై ఉన్న తేదీలను చెక్ చేశారు. ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు మరియు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నన్నే శ్రీనివాస్ అనే వినియోగదారుడికి బూజు పట్టిన పన్నీర్ విక్రయించినందుకు మార్ట్ వారికి అధికారులు 30 వేల రూపాయల జరిమానా విధించారు.