నెల్లిమర్ల: పెండింగ్ జీతాలు చెల్లించాలి: నెల్లిమర్ల నగరపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బాబూరావు
పెండింగ్ జీతం చెల్లించాలని మునిసిపల్ వర్క్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బాబూరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్ బాలాజీ ప్రసాద్ కి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి జీతం, సంక్రాంతి కానుక రూ.1000 నాలుగు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీను, రాము, లక్ష్మి, సరస్వతి, శంకర్, బాలరాజు పాల్గొన్నారు.