ఖమ్మం అర్బన్: మహిళల హక్కులు పరిరక్షించాలి: ప్రముఖ వైద్యురాలు యలమంచిలి నాగమణి
అట్టడుగు వర్గాల మహిళల హక్కులు పరిరక్షించబడాలని ప్రముఖ వైద్యురాలు ఎలమంచిలి నాగమణి అన్నారు. శుక్రవారం నాడు స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు వారి వారి రంగాల్లో ఏ స్థాయిలో కూడా తమ హక్కులను కోల్పోవద్దని, పరిస్థితులు అధిగమించేలా ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఆడపిల్లలు, మహిళలపై జరిగే దురాచారాలు, గృహ హింస, లైంగిక వేధింపులు, అకృత్యాల పట్ల ఐక్యంగా పోరాడాలన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అణచివేత పెరిగిపోయిందన్నారు.