కామారెడ్డి: పోగొట్టుకున్న 157 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు : పట్టణంలో తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
సెల్ ఫోన్లు చోరికి గురైతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్పెషల్ డ్రైవ్ ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న 157 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. సుమారు ఆ చోరికి గురైన మొబైల్ ఫోన్లు 25 లక్షల రూపాయల విలువ వరకు ఉంటుందని తెలిపారు.