సిర్పూర్ టి: కౌటాలలో కంకాలమ్మ జాతరకు శివసతుల ఆటలు - బోనాలతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
సిర్పూర్ నియోజకవర్గం లోని కౌటాల మండల కేంద్రంలో జరుగుతున్న కంకాలమ్మ మహా జాతరకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. కంకాలమ్మ జాతరకు శివసత్తుల ఆటలు బోనాల ఆటలతో కంకాలమ్మ దేవాలయానికి చేరుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కంకాలమ్మ జాతరకు లక్షలాదిమంది తరలి రావడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు,