న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా సిటీ పోలీసులు ప్రత్యేక డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పలు మార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మందుబాబులు వాటిని లెక్కచేయకుండా వాహనాలు నడపడంతో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక్కరాత్రిలోనే 1,198 మంది డ్రంక్ డ్రైవ్ చేస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారని అధికారులు గురువారం వెల్లడించారు. పట్టుబడ్డ వారందరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.