సంగారెడ్డి: అంబేద్కర్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం, పాల్గొన్న కలెక్టర్ ఎస్పీ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ
సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ కళాశాలలో బుధవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రాజ్యాంగ దినోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి రాజ్యాంగ విలువలను కాపాడుతామని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.