అసిఫాబాద్: కాగజ్ నగర్ రూ.76.5 లక్షల సైబర్ క్రైమ్, నలుగురి అరెస్ట్
సైబర్ క్రైమ్ కేసులో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను మోసగించి రూ.76.5 లక్షలు అపహరించిన గ్యాంగ్‌పై కాగజ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ1, ఏ2తో పాటు పూణేలో సంతోష్ తావర్ (ఏ3), అహ్మదాబాద్‌లో దవల్ పటేల్ (ఏ4)లను అరెస్ట్ చేశారు. ఆదివారం కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్ వివరాలను వెల్లడించారు. నిందితులు నకిలీ వ్యాపార పత్రాలతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి లావాదేవీలు జరిపినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.