రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా పరిధిలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు వెల్లడించిన కలెక్టర్ శశాంక
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేశామని, ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కార్యక్రమం కొనసాగుతుందన్నారు