కొత్తగూడెం: జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సమీక్ష సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గంజాయి కేసులపై ఉక్కుపాదం మోపాలని, పాత కేసులలో వారంట్లు అమలుపరచాలని, లేనియెడల జమానత్ దారులకు నోటీసులు అందజేయాలనీ ముద్దాయిలకు సమన్లు త్వరితగతిన అందజేయాలని, పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్షకించి ఆదేశించారు. మరియు చెక్కు బౌన్స్ కేసులలో త్వరగా సమన్స్ అందజేయాలని, వారిపై ఉన్న వారంట్లను అమలుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ బి వేణుగోపాల్. న్యాయమూర్తులు జి. భానుమతి,ఏ. సుచరిత, తదితరులు పాల్గొన్నారు