మన్యం జిల్లాలో జీడీ పిక్కలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలని కొమరాడలో డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి
మన్యం జిల్లాలో జీడిపిక్కల ఫ్యాక్టరీని ప్రారంభించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కొమరాడలో డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మన్యం జిల్లాలో 8 మండలాల్లో జీడి పిక్కలు ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతుల నష్టపోతున్నారని అన్నారు. అలాగే కోటిపాం బ్రిడ్జి మరమ్మతుల పనులు చేపట్టాలని అన్ని సచివాలయాల్లో ఫైబర్ నెట్ సేవలు వినియోగంలోని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.