మేడ్చల్: మక్కాలో జరిగిన ప్రమాద బాధితుల కుటుంబాలను పరామర్శించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మక్కాలో ఉమ్ర యాత్ర సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన పద్మావతి నగర్, అల్లాపూర్ డివిజన్ కు చెందిన రహీమున్నీసా కుటుంబ సభ్యులను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఒకరికి, వ్యక్తిగతంగా ఇద్దరికీ అయ్యే అవసర ఖర్చులను తానే భరిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పాల్గొన్నారు.