కోర్టు అందించిన ఉత్తర్వులను సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్న అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని కార్మిక సంఘాల నాయకులు అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కార్మికుల పట్ట కూడుతున్న వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.