అద్దంకి సర్కిల్ పరిధిలో గొర్రెల దొంగల నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించిన డి.ఎస్.పి మహమ్మద్ మెయిన్
అద్దంకి సర్కిల్ పరిధిలో గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 21 గొర్రెలు, 4 పొట్టేళ్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. వీరిలో కుంకలమర్రు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే ప్రధాన ముద్దాయి పేకాటకు అలవాటు పడి డబ్బులను పోగొట్టుకొని దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఇతనితోపాటు మహమ్మద్ రఫీ, మణికంఠ, శ్రీనివాస రావు లను జతచేసుకొని కారులో గొర్రెలను దొంగలించే వారిని చెప్పారు.