భీమిలి: సీఐటీయూ ఆధ్వర్యంలో కొమ్మధి కూడలిలో చిరు వర్తకులు నిరసన. సోమవారం చిరు వర్తకులు బందుకు పిలుపు.
మా బ్రతకులను రోడ్ల పాలు చేస్తున్నారు.ఇది న్యాయంగా ఉందా అని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నిస్తుమని చిల్లర వర్తకలు,తోపుడు బండ్లు కార్మికులు అన్నారు. ఆదివారం కొమ్మాది ప్రాంతంలో చిల్లర వర్తకులు,వివిధ వృత్తి దారులు తమకు జరిగిన నష్టానికి తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.రేపు అనగా సోమవారం చలో మున్సిపల్ ప్రధాన కార్యాలయం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రచార ఆటో జాతా ను నిర్వహించారు.ఈ సందర్భంగా కొమ్మాది మాష్టర్ ప్లాన్ రోడ్డు లో నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా సి ఐ టీ యు నాయకులు డీ అప్పలరాజు పీ రాజు కుమార్ మాట్లాడుతూ పెదలమైన మన బ్రతుకులకు మరింత దిగజారుస్తున్నారని న్నారు.