రాజేంద్రనగర్: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ అదృశ్యం కేసు నమోదు చేసినపోలీసులు
ఓ మహిళ అదృశ్యమైన ఘటన మీర్పేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సౌభాగ్యలక్ష్మీ నగర్ కాలనీకి చెందిన పాలాది భవ్య అలియాస్ శ్రీదేవి(45) ఈనెల 4 తేదీన దేవరకొండకి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగిరాలేదు. ఆమె కుటుంబ సభ్యులు మీర్పేట్ పరిధిలో వెతికినా, తెలిసిన వారిని, బంధువులను విచారించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు