జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు గంజాయి గుట్టురట్టు చేశారు నమ్మదగిన సమాచారం మేరకు తాండూర్ పట్టణంలో గంజాయి రవాణా జరుగుతుందని గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు సమయంలో తనిఖీ నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ భాష తెలిపారు కర్ణాటక రాష్ట్రంలోని కలబరిగి జిల్లా సేలం పట్టణానికి చెందిన 29 సంవత్సరాల వ్యక్తి కాసిం పటేల్ అలియాస్ ఖాసీం వద్దనుండి 1100 గ్రాముల ఎండు గంజాయిని గంజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు