ధర్మారం: ధర్మారంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో సాంప్రదాయబద్ధంగా గోరింటాకు వేడుకలు
ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. పాఠశాలకు విద్యార్థినులు ఇంటి వద్ద ప్రకృతి సిద్ధంగా తయారు చేసి తీసుకువచ్చిన గోరింటాకుతో వేడుకలు జరిపినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.