హిమాయత్ నగర్: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి
KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ పై ప్రతిస్ అనే యువకుడు వెళుతుండగా స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.