ములుగు: ఏటూరునాగారం ITDA గిరిజన దర్భారు దరఖాస్తులు పరిష్కరించాలి: APO వసంతారావు
Mulug, Mulugu | Sep 15, 2025 గిరిజన దర్బారులో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఏటూరునాగారం ITDA ఏపీవో వసంతరావు అన్నారు. సోమవారం ఉదయం నిర్వహించిన గిరిజన దర్బారులో వివిధ మండలాలకు చెందిన గిరిజనులు మొత్తం 20 దరఖాస్తులు సమర్పించారన్నారు. కాగా, వాటిని ఐటీడీఏలో ఆయా సెక్టార్ అధికారులకు సమర్పించి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఏపీవో ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో రాజకుమార్, ఎస్ఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.